చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
ABN , Publish Date - May 14 , 2026 | 03:22 PM
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ సరదా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేవలం బౌలర్లను ఉతికారేయడమే కాదు, కిచెన్‌లో కూడా తన టాలెంట్ చూపించాడు. స్వయంగా పుల్కాలు చేసి, వాటిని కాల్చుతూ మాస్టర్ చెఫ్ వైభవ్‌గా మారిపోయాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. అతడికి బౌలింగ్ చేయాలంటేనే సీనియర్ బౌలర్లకు సైతం వణుకు పుడుతుందంటే అతిశయోక్తి కాదు. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కానీ రికార్డులను సైతం ఈ 15 ఏళ్ల యువకుడు తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానంలో బ్యాటుతో బౌండరీల వర్షం కురిపించే వైభవ్.. అకస్మాత్తుగా చెఫ్‌గా మారాడు. బ్యాటు పట్టేచేతితో గరిట పట్టుకున్నాడు. దీనికి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ఓ సరదా వీడియో షేర్ చేసింది.
ఆ వీడియోలో వైభవ్ వంటగదిలో రొట్టెలు(పుల్కాలు) చేస్తూ కనిపించాడు. వైభవ్ ఉత్సాహంగా పిండిని కలిపి రొట్టెలు చేస్తూ కనిపించాడు. తాను చేసిన రొట్టెలను చూపిస్తూ... 'ఈ రొట్టె మా అమ్మ రొట్టెల కంటే గుండ్రంగా ఉంది' అని సరదగా వైభవ్ అన్నాడు. అంతేకాక అతడు రొట్టెలను గరిటపై తిప్పుతున్న క్రమంలో కింద కూడా పడిపోయాయి. అలా రెండు మూడు సార్లు జరగడంతో వైభవ్ చిరునవ్వు చిందించాడు. వైభవ్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని అమాయకత్వం, ఆత్మవిశ్వాసం క్రికెట్ అభిమానులను అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వైభవ్ ఆటలోనూ, వంటగదిలోనూ రాణిస్తుండటంతో అతడ్ని ఆల్ రౌండర్ అని నెటిజన్లు పిలుస్తున్నారు.
చాలా మంది అభిమానులు ఈ వీడియోను ఆస్వాదించగా, మరికొందరు మాత్రం రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత ఫామ్ ప్రశ్నించారు. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆరో స్థానానికి పడిపోవడంతో, ప్లేఆఫ్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఆరింటిలో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా 12 పాయింట్లతో నెట్ రన్ రెట్ మెరుగ్గా ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. రాజస్థాన్ తదుపరి మ్యాచ్ మే 12న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆ జట్టు చూస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
బోణీ కొట్టిన సింధు, శ్రీకాంత్, లక్ష్య