Share News

బోణీ కొట్టిన సింధు, శ్రీకాంత్‌, లక్ష్య

ABN , Publish Date - May 14 , 2026 | 02:23 AM

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన,,,

బోణీ కొట్టిన సింధు, శ్రీకాంత్‌, లక్ష్య

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌ : స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21-9, 21-12తో టంగ్‌ టాంగ్‌ (తైపీ)పై వరుస గేముల్లో నెగ్గింది. శ్రీకాంత్‌ 21-14, 21-15తో లోకీన్‌ యూ (సింగపూర్‌)కు షాకివ్వగా, లక్ష్యసేన్‌ 21-16, 21-17తో జాసన్‌ (సింగపూర్‌)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో దేవికా సిహాగ్‌ 21-19, 13-21, 21-15తో నట్సుకి (జపాన్‌)పై, మాళవిక 13-21, 26-24, 21-13తో వెన్‌ ఝాంగ్‌ (కెనడా)పై గెలుపొంది రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. తన్వీ శర్మ 17-21, 8-21తో అకేచి (జపాన్‌) చేతిలో, ఉన్నతి 21-11, 17-21, 16-21తో చొచువాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, అన్మోల్‌ ఖరబ్‌ 21-19, 13-21, 18-21తో చెన్‌ యు ఫీ (చైనా) చేతిలో, ఆయుష్‌ 13-21, 21-17, 4-21తో నరోక (జపాన్‌) చేతిలో, తరుణ్‌ 12-21, 16-21తో కోకి వాటనాబే (జపాన్‌) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలోకి దిగిన జట్లు తొలిరౌండ్‌లోనే ఇంటిబాట పట్టాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 02:23 AM