సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం
ABN , Publish Date - May 14 , 2026 | 03:05 PM
సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టారు. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లను మహిళలు నడపనున్నారు.
హైదరాబాద్, మే 14: సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టారు. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లను మహిళలు నడపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్ల నిర్వహణ కోసం మహిళలకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 13 మంది మహిళా ఉద్యోగులు.. భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ద్వారా మహిళలకు ఉచితంగా ఈ శిక్షణ అందించారు.
త్వరలో విడుదల కానున్న డంపర్ ఆపరేటర్ పోస్టుల్లో మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే బెల్లంపల్లి ఖైరీగూడ గనిలో మహిళలతోనే బ్లాస్టింగ్ విభాగం నిర్వహణ చేపట్టారు. సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ జట్టును అధికారులు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
బడా బాబుల పిల్లలే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయం.. ఇద్దరి అరెస్ట్
45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్
Read Latest Telangana News And Telugu News