Share News

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్

ABN , Publish Date - May 14 , 2026 | 12:15 PM

మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్
Telangana Heatwave

హైదరాబాద్, మే 14: ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజులు వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనుందని తెలిపింది. ఎండల తీవ్ర నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.


అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లవలసి వస్తే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. ఎండల తీవ్రత కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వాతావణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

భద్రాద్రి రామయ్య ఆలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు

బడా బాబుల పిల్లలే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయం.. ఇద్దరి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 14 , 2026 | 01:20 PM