ఆఖరి టీ20లో భారత్‌కు షాక్.. 7 వికెట్లతో న్యూజిలాండ్ విజయం
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:20 PM
హామిల్టన్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో భారత్ 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: హామిల్టన్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో భారత్ 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్ 93 పరుగులతో కివీస్ విజయంలో కీలత పాత్ర పోషించాడు. మిగిలిన బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 65, డారిల్ మిచెల్ 29 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ స్వల్ప పరుగులకే ఔటయ్యారు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 93 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ 61, శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో టీమిండియాను ఆదుకున్నారు. చివర్లో నమన్ ధిర్(33), నితీశ్ కుమార్ రెడ్డి(29) వేగంగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. చివరి టీ20లో ఓడినప్పటికీ భారత్ 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
అనంతపురం 45వ డివిజన్‌లో ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో టీడీపీ నేతలకు గాయాలు