అనంతపురం 45వ డివిజన్‌లో ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో టీడీపీ నేతలకు గాయాలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:47 PM
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతపురం, నవంబర్ 01: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగర పాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్‌లో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఎన్నికల సామాగ్రిని ధ్వంసం చేసి దౌర్జన్యానికి దిగారు. దొంగ ఓట్లు వేస్తూ రిగ్గింగ్‌కు తెగబడ్డారు. వారిని టీడీపీ నేతలు అడ్డుకోబోయారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ మూకలు.. వారిపై రాళ్లతో దాడికి దిగారు.
వైసీపీ నేతల దాడిలో ఇద్దరు టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ జరుగుతున్న వేళ.. వైసీపీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ రెడ్డి పులివెందుల నుంచి భారీగా జనాన్ని తెప్పించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలింగ్ కేంద్రంలోకి అనిల్ రెడ్డి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ చేస్తోంది రోడ్ షో కాదు... ఫ్యాక్షన్ షో: కూటమి పార్టీ నేతలు
రాప్తాడులో గాయపడిన విద్యార్థినికి శస్త్రచికిత్సలు విజయవంతం: నారా లోకేశ్
Read Latest AP News And Telugu News