అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201
ABN , Publish Date - May 14 , 2026 | 09:22 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
స్పోర్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
అజ్మతుల్లా ఒమర్జాయ్ (38; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివర్లో దూకుడుగా ఆడాడు. ప్రియాంశ్ ఆర్య (22), కూపర్ కనోలీ (21) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, దీపక్ చాహర్ 2, కార్బిన్ బాష్, రాజ్ భావా ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తంగా ముంబై ముందు 201 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ నిర్ధేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ