శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ
ABN , Publish Date - May 14 , 2026 | 07:47 PM
జూన్‌లో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: జూన్‌లో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత-ఏ జట్టులో చోటు దక్కింది. ముక్కోణపు సిరీస్ కోసం భారత్-ఎ జట్టు జూన్‌లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
జూన్ 9 నుంచి ప్రారంభంకానున్న ఈ ట్రై సిరీస్‌లో భారత్ ఎ, శ్రీలంక ఎ, అఫ్గానిస్థాన్ ఎ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. మ్యాచ్‌లన్నింటికీ దంబుల్లా ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్-ఎ, శ్రీలంక-ఎ రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. గాలెలో జరిగే ఈ మ్యాచ్‌లకు త్వరలో జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది.
భారత్-ఎ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, ప్రభ్ సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్‌కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.
ఈ వార్తలు కూడా చదవండి
వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్