Share News

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

ABN , Publish Date - May 14 , 2026 | 05:49 PM

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న (బుధవారం) రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(105 నాటౌట్) సెంచరీతో చెలరేగి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని సెంచరీ ధాటికి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో నిలిచింది.


ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. కేకేఆర్ అరంగేట్ర పేసర్ హర్ష్‌ దూబేకు క్షమాపణలు చెప్పాడు. బెంగళూరు ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడిన కోహ్లీ.. పరుగులు తీసే క్రమంలో హర్ష్‌ దూబేను ఢీకొట్టాడు. సింగిల్ పూర్తి చేసిన వెంటనే.. హర్ష్‌దూబేకు క్షమాపణలు చెప్పాడు. హర్ష్‌ దూబే సైతం పర్వాలేదంటూ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. కోహ్లీ చర్యకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. యువ ప్లేయర్లకు కూడా కోహ్లీ క్షమాపణలు చెప్పాడంటే మాములు విషయం కాదని ప్రశంసిస్తున్నారు. అప్‌కమింగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని హితవుపలుకుతున్నారు.


ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, రసిక్ సలామ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆర్సీబీ19.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది. కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్(39) రాణించాడు.


ఈ వార్తలు కూడా చదవండి

వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్

చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

Updated Date - May 14 , 2026 | 06:07 PM