ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ABN , Publish Date - May 14 , 2026 | 07:06 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, పంజాగ్ కింగ్స్ తలపడనున్నాయి. . ఈ క్రమంలో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా మరో కీలక పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాగ్ కింగ్స్ తలపడనున్నాయి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు గత రెండు మ్యాచ్‌ల్లో ముంబైకి తాత్కాలిక సారథిగా వ్యవహరించిన సూర్యకుమార్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. దీంతో బుమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ ఇవాళ నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు కనీసం రెండు విజయాలు అవసరం. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్ పంజాబ్‌కు కీలకం కానుంది. ఈమ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ బెర్తు అవకాశాలను మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో పంజాబ్ కింగ్స్ ఉంది.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్:
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొనోలీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైశాఖ్, హర్‌ప్రీత్ బ్రార్, మిచెల్ ఓవెన్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబె.
ముంబై ఇండియన్స్:
ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ భావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రఘు శర్మ
ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, క్రిష్ భగత్, ట్రెంట్ బౌల్ట్.
ఈ వార్తలు కూడా చదవండి
వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్