Share News

వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్మృతి మంధానకు ధోనీ స్పెషల్ మెసేజ్

ABN , Publish Date - Oct 30 , 2026 | 09:09 PM

భారత మహిళల క్రికెట్ చరిత్రలో 2025 వరల్డ్ కప్ విజయం ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తాజాగా వెల్లడించింది.

వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్మృతి మంధానకు ధోనీ స్పెషల్ మెసేజ్
Smriti Mandhana

స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు 2025లో తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభంలో వరుసగా మూడు ఓటములు ఎదురైనా, ఆ తర్వాత అద్భుతమైన ప్రదర్శనతో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా విశ్వవిజేతగా నిలవడంతో స్టార్ ప్లేయర్, ప్రస్తుత భారత మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కీలక పాత్ర పోషించించింది.


ఈ చరిత్రాత్మక విజయం తర్వాత తనకు అందిన ఓ ప్రత్యేక అభినందన సందేశం గురించి స్మృతి మంధాన తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకుంది. సోషల్ మీడియాకు, ఫోన్లకు సాధారణంగా దూరంగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వయంగా తనకు వాట్సాప్ ద్వారా అభినందనలు తెలిపినట్లు ఆమె వెల్లడించింది. 'ధోనీ సాధారణంగా ఫోన్ ఎక్కువగా ఉపయోగించరు. అలాంటిది ఆయన మేమ ప్రపంచకప్ గెలిచిన తర్వాత అందరికీ అభినందనలు తెలిజేయమని నాకు ప్రత్యేకంగా మెసేజ్ చేశారు. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది' అని మంధాన తెలిపింది.


ఈ కార్యక్రమంలో ధోని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంయా మిస్టర్ కూల్ మాట్లాడుతూ.. మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం భారత క్రికెట్ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందన్నారు. జట్టులో స్మృతి మంధాన నంబర్ తప్పించి.. మరెవరి నంబరు తన దగ్గర లేదని తెలిపాడు. అంతకుముందే తామిద్దరం ఓ ప్రకటన షూట్‌లో పాల్గొనడం వల్ల స్మృతి మంధాన నంబర్ తన దగ్గరకు వచ్చిందని వెల్లడించాడు. ఆమె ద్వారానే మెసేజ్ పంపి, జట్టులోని అందరికీ అభినందనలు తెలపాల్సిందిగా కోరినట్లు ధోనీ వివరించారు. 'మీరు దేశం కోసం ఒక పెద్ద ట్రోఫీని తేవడమే కాకుండా, భవిష్యత్తులో క్రికెట్‌ను ఒక వృత్తిగా ఎంచుకోవాలనుకునే ఎంతో మంది అమ్మాయిలకు మార్గదర్శకం అయ్యారు' అని ధోనీ ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి:

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ జెట్ తొలిసారిగా లాండింగ్

భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో పార్సిల్ సేవలు..

ట్రిపుల్ మర్డర్ కలకలం.. 22 సెకన్లలో 5 రౌండ్లు కాల్పులు..

Updated Date - Oct 30 , 2026 | 09:09 PM