Share News

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ జెట్ తొలిసారిగా లాండింగ్

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:50 PM

భారత వాయుసేనలో తాజాగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యాధునిక ఫైటర్ జెట్ రఫేల్ తొలిసారిగా యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై మొదటిసారి అక్టోబర్ 29న విజయవంతంగా లాండయ్యింది

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ జెట్ తొలిసారిగా లాండింగ్
Rafale Landing on INS Vikrant

ఇంటర్నెట్ డెస్క్: భారత్ వాయుసేనలో తాజాగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యాధునిక ఫైటర్ జెట్ రఫేల్ తొలిసారిగా యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై మొదటిసారి అక్టోబర్ 29న విజయవంతంగా లాండయ్యింది. ఐఎన్ఎస్ కార్యకలాపాలకు అనుగుణంగా రఫేల్‌లో మార్పులకు భారత నేవీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కీలక ఘట్టమైన లాండింగ్ దిగ్విజయంగా పూర్తయ్యింది. నేవీలోకి పూర్తిస్థాయిలో రఫేల్‌ను ప్రవేశపెట్టేందుకు ఇది ముఖ్య ఘట్టమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


రఫేల్ కోసం ఫ్రాన్స్‌తో డీల్..

భారత్‌కు అవసరమైన 26 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో 2025లో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రూ.63 వేల కోట్ల డీల్‌లో భాగంగా 22 సింగిల్ సీటర్ జెట్స్‌తో పాటు నాలుగు ట్విన్ సీటర్ జెట్స్‌ను ఫ్రాన్స్ సరఫరా చేయనుంది. ఫైటర్ జెట్స్‌తో పాటు ఆయుధాలు, శిక్షణ, సిమ్యులేటర్లు, ఇతర పరికరాలన్నీ ఫ్రాన్స్ సమకూర్చేలా ఒప్పందం కుదిరింది. 2030 నాటికి విమానాల్ని సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భారత సిబ్బంది ఈ ఫైటర్ జెట్స్‌కు సంబంధించిన శిక్షణ పొందుతున్నారు. ఈ డీల్‌లో భాగంగా రఫేల్ ఫ్యూజిలాజ్ తయారీ, నిర్వహణ, రిపేర్లకు సంబంధించిన కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలను రఫేల్‌తో జతపరిచేందుకు కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు కూడా ఫ్రాన్స్ అంగీకరించింది.


ఈ వార్తలనూ చదవండి:

అలాంటి శారీరక సంబంధం అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్

Updated Date - Oct 30 , 2026 | 05:32 PM