Share News

25 బంతులాడి డకౌటైన బ్యాటర్.. ఎవరంటే!

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:51 PM

ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ డివిజ‌న్‌-2లో డ‌ర్హ‌మ్ త‌ర‌పున ఆడుతున్న భార‌త వెట‌ర‌న్ మయాంక్ అగర్వాల్ ఆశించిన మేర రాణించడం లేదు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో 25 బంతులాడి డకౌట్ అయ్యాడు.

25 బంతులాడి డకౌటైన బ్యాటర్.. ఎవరంటే!
Mayank Agarwal duck

స్పోర్ట్స్ డెస్క్: సాధారణంగా ఎవరైనా ప్రారంభంలో పరుగుల చేసేందుకు ఇబ్బంది పడతారు. కానీ ఓ బ్యాటర్ మాత్రం 25 బంతులు ఆడినా ఒక్క పరుగుకు కూడా చేయలేదు. చివరకు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అదికూడా భారత వెటరన్ బ్యాటర్ కావడం గమనార్హం. మరి.. ఆ బ్యాటర్ ఎవరు, ఆ టోర్నీ ఏమిటి.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...


ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ డివిజ‌న్‌-2 టోర్నీ జరుగుతుంది. ఇందులో డ‌ర్హ‌మ్ జట్టు త‌ర‌పున ఆడుతున్న భార‌త వెట‌ర‌న్ మయాంక్ అగర్వాల్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అగర్వాల్ ఆశించిన మేర రాణించడం లేదు. తాజాగా చెస్టర్-లె-స్ట్రీట్ వేదిక‌గా మిడిలెక్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ తీవ్ర నిరాశపరిచాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అగర్వాల్‌.. బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందిపడ్డాడు.


25 బంతులు ఎదుర్కొన్న మయాంక్.. తన ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మిడిలెక్స్‌ బౌలర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి.. అగర్వాల్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 35 ఏళ్ల ఈ కర్ణాటక ప్లేయర్ చివరగా 2022లో శ్రీలంకపై భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. మొత్తంగా అతడు టీమిండియా తరఫున 21 టెస్టు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 36 ఇన్నింగ్స్‌లలో 1,488 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ శతకాలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతడి కెరీర్ బెస్ట్ స్కోర్ 243 పరుగులగా ఉంది.


ఇవి కూడా చదవండి:

'మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది?'

ఆసియా క్రీడలు జరగనున్న ప్రాంతంలో భారీ వరదలు.. క్రీడాకారులు సురక్షితం

Updated Date - Sep 09 , 2026 | 03:55 PM