‘ఒకరి చావు కోరడం సమర్థనీయం కాదు’.. కేసీఆర్‌పై వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వివరణ
ABN , Publish Date - Sep 09 , 2026 | 03:00 PM
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఒకరి చావు కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. ముఖ్యమంత్రిని, దళిత అసెంబ్లీ స్పీకర్‌ను, మహిళా మంత్రులను అసభ్యకరంగా కులాల పేరుతో దూషిస్తూ వ్యక్తిగతంగా బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని.. స్పీకర్‌ను అసభ్యపదజాలంతో దూషించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కడుపు మండి కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి రావాలని, సమస్యలపై చర్చించాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలదని.. కేసీఆర్ కుటుంబ ఒక్కరిదే కాదని ఎమ్మెల్యే అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎంపై, వారి కుటుంబ సభ్యులపై బూతులు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా. వారి ముందు ఇలా మాట్లాడుతారా. టీవీలలో మీ బూతులు వినలేక మహిళలు చెవులు మూసుకుంటున్నారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఆ మాటలు వినలేక తలదించుకుంటున్నారు’ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీపై ‘ఎక్కడ సచ్చిండు రాహుల్ గాంధీ’ అని మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో కేటీఆర్ మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా మీడియాకు ఎమ్మెల్యే విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి...
సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్
కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News