Share News

భారతరత్నకు ‘సర్’ కష్టాలు.. పేరులో ఒక అక్షరం అదనంగా ఉండడంతో..

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:06 PM

సామాన్య ప్రజలే కాక ప్రముఖులూ ‘సర్’ కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బెంగళూరు శాస్త్రవేత్తకు ‘సర్’ నోటీసులు అందాయని సమాచారం.

భారతరత్నకు ‘సర్’ కష్టాలు.. పేరులో ఒక అక్షరం అదనంగా ఉండడంతో..
Scientist CNR

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్‌కు ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు పంపించిందని సమాచారం. పాత ఓటరు లిస్టులో ఆయన పేరు.. ఒక అక్షరం కారణంగా ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న పేరుతో మిస్‌మ్యాచ్ అయిందని వార్తలు వస్తున్నాయి. పాత రికార్డుల్లో ‘Prof CNR Rao’ అని ఉంటే, కొత్త రికార్డుల్లో ‘Proff CNR Rao’ అని ఉంది. ఈ ఒక్క ‘ఎఫ్’ అక్షరం అదనంగా ఉండడం వల్ల ఈసీ నోటీసులు పంపించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


అయితే ప్రొఫెసర్ సీఎన్ఆర్‌ ప్రతినిధి మాత్రం తమకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు అందలేదని మీడియాకు తెలిపారు. అలాగే ఒక్క అక్షరం అదనంగా ఉందని.. అది తప్ప మరే ఇతర సమస్యా లేదని ఆయన వివరించారు. ఒక్క సీఎన్ఆర్‌కే కాక చాలా మంది ప్రముఖులకు సర్ నోటీసులు అందుతున్నాయి. మంగళూరుకు చెందిన పద్మశ్రీ గ్రహీత హరేకల హజబ్బకు పేరులో వ్యత్యాసం కారణంగా ‘సర్’ నోటీసులు అందాయి. కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు.


ఇవి కూడా చదవండి...

రోడ్డు యాక్సిడెంట్‌లో యువతి మరణం.. 26 రోజుల తర్వాత బయటపడ్డ ట్విస్ట్..

ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య

Updated Date - Sep 09 , 2026 | 03:21 PM