Share News

మద్యం రవాణా కుంభకోణంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి దక్కని ఊరట

ABN , Publish Date - Sep 09 , 2026 | 02:11 PM

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బుధవారం ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది.

మద్యం రవాణా కుంభకోణంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి దక్కని ఊరట
AP Liquor Scam A9 Eswar Kiran Kumar Reddy

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బుధవారం ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. అయితే రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని అతడికి సూచించింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో అతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అరెస్టు చేసింది.


మరో వైపు ఒకే వ్యవహారంపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి కిరణ్‌కుమార్‌ రెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లారు. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో తప్పేమి లేదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో అతడు ఏ9 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆన్‌లైన్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ కోసం ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేయగానే షాక్..!

రైలు ప్రయాణమంటే ఇంత సాహసం చేయాలా?.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 02:21 PM