Share News

ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్ డీల్.. ముంబైకి అర్ష్‌దీప్, పంజాబ్‌కు పాండ్యా!

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:55 AM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో హార్దిక్‌ పాండ్య బంధం ముగిసింది. 2027 సీజన్‌కు ముందు అతడిని పంజాబ్‌ జట్టుకు వదులుకుంది. అతడికి బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకుంది.

ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్ డీల్.. ముంబైకి అర్ష్‌దీప్, పంజాబ్‌కు పాండ్యా!
Hardik Pandya

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు మరో వారంతో ముగియనుంది. ఈ నెల 17వ తేదీన రిటెన్షన్ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య బ్లాక్‌బస్టర్ ట్రేడ్ డీల్ జరిగింది. ముంబై జట్టు హార్దిక్ పాండ్యాను పంజాబ్ జట్టుకు వదులుకుంది. అందుకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకుంది. ఈ ట్రేడ్‌ను ఐపీఎల్‌ (IPL) నిర్వాహకులు బుధవారం అధికారికంగా ప్రకటించారు.


ముంబై, పంజాబ్ మధ్య జరిగిన ఈ ఒప్పందంతో హార్దిక్‌ (Hardik Pandya) ధర రూ.18 కోట్లకు పెరిగింది. ముంబై జట్టు తరఫున ప్రస్తుతం పాండ్యా ధర రూ.16.35 కోట్లుగా ఉంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) అతడిని రూ.18 కోట్లకు తీసుకునేందుకు అంగీకరించింది. మరోవైపు అర్ష్‌దీప్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.18 కోట్ల ప్రస్తుత ధరతోనే ముంబై దక్కించుకుంది. గత సీజన్‌లో ముంబై జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. పంజాబ్‌లో మాత్రం ఆ అవకాశం లేదు. ప్రస్తు కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోనే అతడు ఆడాల్సి ఉంది.


హార్దిక్ పాండ్యా 2015లో ముంబై ఫ్రాంచైజీలో చేరి కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2015, 2017, 2019, 2020లో ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వెళ్లి.. తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు కప్‌ అందించాడు. 2024కు ముందు తిరిగి ముంబై జట్టులో చేరి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్‌లో పాండ్యా కెప్టెన్సీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వ్యక్తిగతంగానూ అతడు రాణించలేదు. దీంతో హార్దిక్‌ను వదులుకోవాలని ఆ ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. ఇందుకోసం పలు ఫ్రాంచైజీలతో చర్చించగా.. చివరకు పంజాబ్‌తో డీల్ కుదిరింది. మరోవైపు, పంజాబ్‌ తరఫునే అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌ (Arshdeep Singh) గత ఎనిమిదేళ్లుగా ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఈ లెఫ్ట్‌ ఆర్మీ ఫాస్ట్‌ బౌలర్‌ 96 ఐపీఎల్‌ మ్యాచుల్లో 111 వికెట్లు పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 12:28 PM