ఐపీఎల్ 2026: క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దు?
ABN , Publish Date - May 26 , 2026 | 02:46 PM
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్ పోరు ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్ పోరు ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తోంది కాబట్టి.. ఇరు జట్లు తమ సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధమయ్యాయి. అయితే వర్షం కారణంగాఈ హై-వోల్టేజ్ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
నేడు(మంగళవారం) ధర్మశాలలో వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పగలు భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మ్యాచ్ జరిగే సమయంలో కూడా వర్షం పడే అవకాశం ఉందట. అయితే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యేంత వాన ప్రభావం ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. టాస్ పడే సమయానికి వర్షం పడటం వల్ల మ్యాచ్ ప్రారంభం కావడంలో కాస్త ఆలస్యం జరగొచ్చు కానీ, రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశం తక్కువగానే ఉందని సమాచారం.
కొండ ప్రాంతమైన ధర్మశాలలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే వాతావరణం అనుకూలించి మ్యాచ్ సజావుగా సాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ సాయంత్రం వర్షం పడి పిచ్‌ను ఎక్కువ సమయం కవర్లతో కప్పి ఉంచాల్సి వస్తే.. అది ఇరు జట్ల వ్యూహాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు ఎదురుకావచ్చు, ఎందుకంటే ప్రారంభంలో బంతి తక్కువ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు బాగా కలిసిరానుంది. మొత్తంగా ఈ రసవత్తర పోరులో గుజరాత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందో, లేక ఆర్సీబీ పుంజుకుని ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో కొత్త చరిత్ర.. ఆ నాలుగింట్లో ఏ జట్టు గెలిచినా..!
ఇన్‌స్టాలో పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!