Share News

అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష.. ఇప్పటికి 16 సార్లు పెరోల్..

ABN , Publish Date - May 26 , 2026 | 02:27 PM

అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ (డేరా బాబా) రామ్ రహీమ్‌ మరోసారి 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి మంగళవారం బయటకు వచ్చారు.

అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష.. ఇప్పటికి 16 సార్లు పెరోల్..
Gurmeet Ram Rahim

అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ (డేరా బాబా) రామ్ రహీమ్‌ మరోసారి 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి మంగళవారం బయటకు వచ్చారు. 2017లో శిక్ష పడిన తర్వాత ఆయనకు 16వసారి పెరోల్ లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది (Ram Rahim parole).


ఇప్పటికి గుర్మీత్ శిక్ష ప్రారంభమై 9 ఏళ్లు అవుతోంది. ఈ 9 ఏళ్ల కాలంలో ఆయన 400 రోజులకు పైగా జైలు బయటే గడిపారు. ప్రస్తుత పెరోల్ కాలంలో గుర్మీత్.. సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రంలో ఉండనున్నారు. అధికారులు కఠిన నిఘా మధ్య ఆయనను అక్కడికి తరలించినట్లు సమాచారం. తన ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌కు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు (Gurmeet Ram Rahim).


గతంలో ఎన్నికల సమయాల్లో కూడా రామ్ రహీమ్‌కు పెరోల్ మంజూరు కావడం వివాదాస్పదమైంది (Parole controversy). ప్రతిపక్ష పార్టీలు దీనిపై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రామ్ రహీమ్ విడుదలయ్యే ప్రతిసారీ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి కూడా హరియాణా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..


నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 26 , 2026 | 02:29 PM