Share News

సంజూ శాంసన్ విధ్వంసం.. విండీస్‌పై భారత్‌ 249 పరుగుల భారీ స్కోర్

ABN , Publish Date - Oct 09 , 2026 | 09:32 PM

రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్(41 బంతుల్లో 82 పరుగులు) చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది.

సంజూ శాంసన్ విధ్వంసం.. విండీస్‌పై భారత్‌ 249 పరుగుల భారీ స్కోర్
Sanju Samson

స్పోర్ట్స్ డెస్క్: రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్(41 బంతుల్లో 82, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన శాంసన్.. ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతడికి తోడు ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 43 పరుగులు) దనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు.


చివర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (17 బంతుల్లో 40 పరుగులు), హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (18 బంతుల్లో 44 నాటౌట్‌, 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షమర్ స్ప్రింగర్ రెండు వికెట్లు సాధించాడు. అభిషేక్‌ (12 బంతుల్లో 20) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఇషాన్‌, సంజూ శాంసన్‌, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. భారత ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అంతకముందు టాస్ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు కురిసే అవకాశం ఉండడంతో బౌలింగ్‌ ఎంచుకున్నట్లు హోప్‌ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

నా సలహా పాటించి ఉంటే ఐదు కప్పులు ఆర్సీబీవే: పార్థివ్

'హర్మన్‌ప్రీత్ దారి వేరు.. స్మృతి ప్రయాణం వేరు'.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

Updated Date - Oct 09 , 2026 | 09:40 PM