Share News

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. నాలుగో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

ABN , Publish Date - Nov 11 , 2026 | 10:53 AM

టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగే నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. నాలుగో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!
Shreyas Iyer

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్ కన్నేసింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. వర్షం కారణంగా మూడో వన్డే రద్దు కావడంతో శుక్రవారం మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.


నాలుగో వన్డేలో విజయం సాధించి.. సిరీస్ గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా.. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అన్షుల్ కాంబోజ్ చివరి రెండు వన్డేలకు దూరమయ్యారు. దీంతో గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనుండగా.. ఇషాన్ కిషన్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అలానే తిలక్ వర్మ, యశ్ ఠాకూర్, కుమార్ కుశాగ్ర కొత్తగా జట్టులోకి చేరారు. ఈ మార్పుల నేపథ్యంలో టీమ్ కాంబినేషన్‌ను మార్చాల్సి ఉంది.


తాజా మార్పులతో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనింగ్ చేయగనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఐదో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ స్థానాలు భర్తీ అయితే.. తెలుగు తేజం తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. నమన్ ధీర్, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. నాలుగో పేసర్‌గా మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


నాలుగో వన్డేకు భారత తుది జట్టు(అంచనా):

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/తిలక్ వర్మ, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, మహ్మద్ సిరాజ్/యశ్ ఠాకూర్.


ఇవి కూడా చదవండి:

47 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. మరో లీగ్‌లోకి గేల్ రీఎంట్రీ!

శుభ్‌మన్ గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌

మూడో వన్డే రద్దైనా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

Updated Date - Nov 11 , 2026 | 11:09 AM