శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:43 AM
ఏసీసీ అండర్-19 ఆసియా కప్2026లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో ఆర్యవీర్ చోటు దక్కించుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఏసీసీ అండర్-19 ఆసియా కప్2026లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కొత్త చరిత్ర సృష్టించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ భారీ శతకంతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్యవీర్ 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 160 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో ఆర్యవీర్ చోటు దక్కించుకున్నాడు. అలానే గిల్, మయాంక్ అగర్వాల్ రికార్డును సమం చేశాడు.
యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో అంబటి రాయుడు (177 నాటౌట్,2002) తొలి స్థానంలో ఉండగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (175) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజ్ బవా (162 నాటౌట్) మూడో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో మయాంక్ అగర్వాల్ (160), గిల్ (160) కొనసాగుతుండా.. వారి రికార్డును ఆర్యవీర్ సమం చేశాడు. 2017లో వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యూత్ వన్డేలో గిల్ 160 పరుగులు సాధించగా, 2009లో హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డేలో మయాంక్ అగర్వాల్160 పరుగులు సాధించాడు.
టీమిండియా క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ.. తన కెరీర్‌ను నిర్మించుకోగా, ఆర్యవీర్ కేవలం తండ్రి నుంచే కాకుండా ఇంకా చాలా మంది దిగ్గజాల నుంచి స్ఫూర్తి పొందుతాడు. ఇక ఆర్యవీర్ శతకానికి తోడు వీకే వినీత్ అర్థసెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. 310 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటయ్యింది. ఈ విజయంతో ఆసియా కప్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి:
నాకైతే తెలియదు.. ఖవాజా ఆరోపణలకు స్టార్క్ కౌంటర్!
అండర్ 19 ఆసియా కప్: ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం..