శాండ్‌పేపర్ వివాదం: నాకైతే తెలియదు.. ఖవాజా ఆరోపణలకు స్టార్క్ కౌంటర్!
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:23 PM
2018 శాండ్‌పేపర్ వివాదంపై కొద్దిరోజులుగా చర్చలకు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. దీనిపై తాజాగా ఆసీస్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2018 శాండ్‌పేపర్ వివాదంపై కొద్దిరోజులుగా చర్చలకు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు మాత్రమే కాదు.. జట్టు మొత్తానికి ఆ సమయంలో శాండ్‌పేపర్ వాడనున్నట్లు తెలుసని బాంబు పేల్చాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. ఖవాజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. తన అభిప్రాయంలో ఎలాంటి మార్పూ లేదని తెలిపాడు.
‘నిజం చెప్పాలంటే.. 2018 బాల్ ట్యాంపరింగ్ చర్చను నేను పెద్దగా పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం ఏం జరిగిందనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అప్పట్లోనూ, ఆ తర్వాత కూడా ఈ వ్యవహారంపై మాకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. బౌలర్ల తరఫున నేను మాట్లాడలేను. కానీ నా వరకు వస్తే.. నా అభిప్రాయం మారలేదు. 2021లో ఆస్ట్రేలియా బౌలర్లు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో.. బంతి పరిస్థితిని మార్చేందుకు ఎలాంటి బయటి వస్తువును మైదానంలోకి తీసుకువచ్చిన విషయం తమకు తెలియదని స్పష్టం చేశారు. ఆ ప్రకటనలో చెప్పినట్లుగానే.. మైదానంలోకి అలాంటి వస్తువులు తీసుకువచ్చిన విషయం మాకు తెలియదు. అంతకుమించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. పోర్ట్ ఎలిజబెత్ టెస్టులోనూ బాల్ ట్యాంపరింగ్ జరిగిందని ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. దీనిపై ఆ పుస్తక రచయితలే వివరణ ఇవ్వాలి’ అని ఖవాజా వ్యాఖ్యలకు స్టార్క్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి...
భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ.. ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఏలూరులో పెద్దపులి కలకలం.. ఆవు, రెండు దూడలను చంపేసిన పులి