రూ.50 వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన భైంసా మునిసిపల్ కమిషనర్
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:33 AM
నిర్మల్ జిల్లా భైంసా మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
హైదరాబాద్/నిర్మల్ రూరల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా భైంసా మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. భైంసా మునిసిపాలిటీలో చేపట్టిన సివిల్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 2.63 లక్షల బిల్లు విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం నిర్మల్ పట్టణంలోని ఓ హోటల్ సమీపంలో లంచం తీసుకుంటుండగా సంతో్‌షను పట్టుకున్నారు.
గతంలోనూ నిందితుడు రూ.6.40 లక్షల బిల్లు విడుదల చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మిగిలిన బిల్లు క్లియర్ చేయడానికి మరో రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నిందితుడి కారులోని డ్యాష్‌బోర్డులో రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సంతో్‌షను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ పి.మధు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News