Share News

మూడో వన్డే రద్దైనా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

ABN , Publish Date - Nov 11 , 2026 | 07:54 AM

హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడో వ‌న్డే మ్యాచ్ ఒక్క బంతి ప‌డ‌కుండానే వ‌ర్షం కారణంగా ర‌ద్దైన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ జ‌ర‌గ‌నప్ప‌టికీ, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం మాజీ కెప్టెన్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

మూడో వన్డే రద్దైనా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడో వ‌న్డే మ్యాచ్ ఒక్క బంతి ప‌డ‌కుండానే వ‌ర్షం కారణంగా ర‌ద్దైన సంగతి తెలిసిందే. ఉద‌యం నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ ర‌ద్దుకే అంపైర్లు మొగ్గు చూపారు. దీంతో ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భార‌త్ ప్ర‌స్తుతం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే మ్యాచ్ జ‌ర‌గ‌నప్ప‌టికీ, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్. ధోని రికార్డును బద్దలు కొట్టాడు.


న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ఎక్కువ వ‌న్డేలు ఆడిన భార‌త క్రికెట‌ర్ల జాబితాలో కోహ్లీ ధోనిని అధిగ‌మించాడు. ధోని ఇప్ప‌టివ‌ర‌కు కివీస్ గ‌డ్డ‌పై 15 వ‌న్డేలు ఆడ‌గా.. తాజాగా హామిల్ట‌న్ వేదిక‌గా ర‌ద్దైన వ‌న్డే కోహ్లీకి న్యూజిలాండ్‌లో 16వ వ‌న్డే మ్యాచ్‌. ఈ వన్డే జరగనప్పటికీ... తుది జట్టులో కోహ్లీ ఉండటంతో ఈ మ్యాచ్ అతడి ఖాతాలో పడుతుంది. ఓవ‌రాల్‌ జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ పేసర్ జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్ చెరో 22 వ‌న్డేలతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ (19 వ‌న్డేలు), రోహిత్ శ‌ర్మ (17 వ‌న్డేలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న‌ప్ప‌టికీ కోహ్లి నాలుగో స్థానంలోనే ఉండ‌నున్నాడు.


ఎందుకంటే.. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ్ కూడా ఉన్నాడు. అతడి వన్డే మ్యాచ్‍ల సంఖ్య కూడా కోహ్లీతో పాటు పెరుగుతుంది. టీమిండియా మ‌రోసారి కివీస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పటికీ, అప్ప‌టివ‌ర‌కు కోహ్లీ ఆడ‌డం సందేహమే. దీంతో ఈ సిరీస్‌లో మిగిలి ఉన్న రెండు వన్డేలను కలిపి కోహ్లీ కివీస్ గ‌డ్డ‌పై 18 వ‌న్డేల‌తో నిల‌వ‌నున్నాడు. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ మాత్రం 19 వ‌న్డేల‌తో అజారుద్దీన్‌తో క‌లిసి సంయుక్తంగా నిల‌వ‌నున్నాడు.


కోహ్లీ న్యూజిలాండ్‌లో మ్యాచ్‌ల సంఖ్య పరంగానే కాకుండా బ్యాటింగ్‌లో కూడా గణనీయమైన విజయాన్ని సాధించాడు. కివీస్ గడ్డపై అతడు ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో సహా 48.35 సగటు, 95.35 స్ట్రైక్ రేట్‌తో 677 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ అత్యధిక వన్డే స్కోరు 123. 2014లో నేపియర్‌ వేదికగా జరిగిన వన్డేలో ఈ బెస్ట్ స్కోర్‌ను కోహ్లీ న్యూజిలాండ్‌పై సాధించాడు. ఇరుజ‌ట్ల మ‌ధ్య నాలుగో వ‌న్డే శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది.


ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌

దేవుడు వరమిచ్చినా..

ఒక్క బంతీ పడలేదు..

Updated Date - Nov 11 , 2026 | 08:00 AM