Share News

ఒక్క బంతీ పడలేదు..

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:45 AM

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన మూడో వన్డే భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలకు కూడా...

ఒక్క బంతీ పడలేదు..

భారత్‌-న్యూజిలాండ్‌ మూడో వన్డే రద్దు

హామిల్టన్‌: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన మూడో వన్డే భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలకు కూడా వరుణుడు అంతరాయం కలిగించినా ఫలితం మాత్రం వచ్చింది. కానీ మంగళవారం మ్యాచ్‌లో టాస్‌ మాత్రమే పడింది. అది కూడా రెండు గంటల ఆలస్యంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా.. సరిగ్గా అదే సమయానికి వర్షం ఆరంభమైంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. గంటన్నర తర్వాత తెరిపినివ్వడంతో ఉదయం 9 గంటలకు టాస్‌ అని ప్రకటించారు. తీరా ఇందుకోసం అంతా సిద్ధమవుతుండగా మరోసారి వరుణుడు పలకరించాడు. చివరకు పావుగంట తర్వాత టాస్‌ వేయగా భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కానీ టాస్‌ వేసిన తర్వాత తిరిగి వర్షం కురవడం.. కాసేపయ్యాక తెరిపినివ్వడం జరుగుతూ వచ్చింది. కనీసం 20 ఓవర్ల ఆటను ఆడించేందుకు కూడా వీలు కాకపోవడంతో ఉదయం 11.11 గంటలకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇక కివీ్‌సకు సమం చేసే అవకాశం మాత్రమే ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:45 AM