Share News

47 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. మరో లీగ్‌లోకి గేల్ రీఎంట్రీ!

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:50 AM

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. తాజాగా అతడు మరో లీగ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 47 ఏళ్ల వయసులో ఇటాలియా టీ10 లీగ్ లోఆడాలని నిర్ణయించుకున్నాడు.

47 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు..  మరో లీగ్‌లోకి గేల్ రీఎంట్రీ!
Chris Gayle

స్పోర్ట్స్ డెస్క్: విధ్వంసకర బ్యాటింగ్‌తో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 'యూనివర్స్ బాస్‌'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో గేల్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. టోర్నీ ఏదైనా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాంటి ఈ విధ్వంసకర బ్యాటర్ మరోసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న47 ఏళ్ల గేల్.. తాజాగా 'ఇటాలియా టీ10 లీగ్'‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో అతను 'వెనిస్ లైవ్‌వైర్స్' జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. నవంబర్ 18 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది.


ఇటలీ అభిమానులను అలరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గేల్ ఈ సందర్భంగా పేర్కొనాడు. క్రికెట్ లెజెండ్‌ను తమ జట్టులోకి స్వాగతించడం సంతోషంగా ఉందని వెనిస్ లైవ్‌వైర్స్ డైరెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గేల్.. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో నిరంతరం కొనసాగుతున్నాడు. ఇటీవలే ముగిసిన 'వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026'లోనూ సత్తా చాటిన అతను, తన జట్టును ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.


తన సుదీర్ఘ కెరీర్‌లో వెస్టిండీస్ తరఫున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్.. ఐపీఎల్‌లోనూ అనేక రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా (175 నాటౌట్) ఇప్పటికీ అతడి పేరిటే రికార్డు ఉంది. తాజాగా 47 ఏళ్ల వయసులోనూ టీ10 లీగ్‌లో గేల్ బరిలోకి దిగుతుండటంతో క్రికెట్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

మూడో వన్డే రద్దైనా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

శుభ్‌మన్ గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌

దేవుడు వరమిచ్చినా..

Updated Date - Nov 11 , 2026 | 09:06 AM