Share News

ఒక్క బంతీ పడలేదు..

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:26 AM

చాంపియన్స్‌ ట్రోఫీకి తొలిసారిగా వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ ఒక్క బంతీ పడకుండానే రద్దయ్యింది...

ఒక్క బంతీ పడలేదు..

ఆసీ్‌స X దక్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దు

చాంపియన్స్‌ ట్రోఫీ

రావల్పిండి: చాంపియన్స్‌ ట్రోఫీకి తొలిసారిగా వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ ఒక్క బంతీ పడకుండానే రద్దయ్యింది. సరిగ్గా మ్యాచ్‌కు గంట ముందే వర్షం మొదలవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. కనీసం టాస్‌ వేసేందుకు కూడా వరుణుడు అవకాశమివ్వలేదు. నిరంతరాయంగా వాన కురుస్తూనే ఉండడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ కూడా వీలుపడలేదు. చివరకు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.43కు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ ఫలితంతో ఆసీ్‌స-దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్‌ లభించింది. మరోవైపు చాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఆడిన చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫలితం తేలకుండా ముగియడం ఇది నాలుగోసారి.

మైదానమంతా కప్పలేరా?

భారీ వర్షం కురుస్తుంటే కేవలం పిచ్‌ ప్రాంతం మాత్రమే కప్పి, అవుట్‌ ఫీల్డ్‌ను కప్పకుండా ఎందుకు వదిలేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ మాత్రం ఏర్పాట్లు చేయని పాక్‌ బోర్డు అసలు ఐసీసీ అందించిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నట్టు లేదని భారత మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు.


ఇవీ చదవండి:

టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:26 AM