ప్రపంచకప్ గెలిపించినా.. ఆ రెండు నెలలు చాలా కష్టంగా గడిచాయి: సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Nov 11 , 2026 | 08:35 AM
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత కొద్ది నెలలకే జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత కొద్ది నెలలకే జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఒకవైపు కెప్టెన్సీ బాధ్యతలు దూరమవడం, మరోవైపు భారత జట్టులో స్థానం లేకపోవడంతో సూర్య తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడో తాజాగా వెల్లడించాడు. తన జీవితంలో ఆ రెండు నెలలు ఎంతో కష్టంగా గడిచాయని చెప్పాడు (Suryakumar Yadav Dropped).
2026 మార్చి 8న న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. అయితే ఆ టోర్నీలో బ్యాటర్‌గా విఫలమైన సూర్య జట్టులో స్థానం కోల్పోయాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక కాలేదు. ప్రపంచకప్ గెలిపించిన టీమ్ కెప్టెన్‌గా ఉన్న తనకు జట్టులో చోటు లేకపోవడం ఎంతో కష్టంగా అనిపించిందని సూర్య తెలిపాడు. ముంబైలో జరిగిన టీ20 ముంబై లీగ్ సెలబ్రేషన్ ఆఫ్ ఛాంపియన్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచకప్ తర్వాతి కాలం తనకు కొంత కష్టంగా గడిచిందని చెప్పాడు (T20 World Cup 2026).
'ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. ఆ రెండు నెలలూ చాలా కష్టంగా గడిచాయి. అయితే 2026 మే నెలలో ఐపీఎల్ సమయంలో నాకు కూతురు పుట్టింది. దీంతో నా దృష్టి పూర్తిగా పాపపైకి మళ్లింది. ఆమె పుట్టిన తర్వాత జీవితం ఎంతో అందంగా మారింది. జట్టులో చోటు కోల్పోయిన బాధ నుంచి బయటపడటానికి కుటుంబంతో గడిపిన సమయం కూడా ఎంతగానో ఉపయోగపడింది' అని చెప్పాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ తన దృష్టిని దేశవాళీ క్రికెట్‌పై పెట్టాడు. రానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...