కేరళం జట్టుకు కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఎంపిక..
ABN , Publish Date - Nov 11 , 2026 | 09:46 AM
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో కీలక అవకాశం దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 టోర్నీ కోసం అతడు కేరళం జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఓపెనర్, 2026 ప్రపంచ కప్ విజేత సంజూ శాంసన్‌కు మరో కీలక అవకాశం దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 టోర్నీ కోసం అతడు కేరళం జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన జట్టును కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) తాజాగా ప్రకటించింది. తాజాగా కేరళం జట్టులో పలువురు అనుభవజ్ఞులకు అవకాశం దక్కింది. రెడ్‌బాల్ జట్టు కెప్టెన్ విష్ణు వినోద్‌తో పాటు మరో సీనియర్ ఆటగాడు మహ్మద్ అజరుద్దీన్ కూడా చోటు దక్కించుకున్నారు.
ఇటీవల రంజీ ట్రోఫీకి ముందు జట్టులోకి తిరిగి వచ్చిన వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనాకు కూడా జట్టులో స్థానం దక్కింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విఘ్నేశ్ పుత్తూర్‌కు కూడా చోటు లభించింది. 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న కేఎం ఆసిఫ్‌ను కూడా ఎంపిక చేశారు. గత సీజన్లో కూడా సంజూ శాంసన్ కేరళం జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఆ టోర్నీలో ఎలైట్ గ్రూప్-ఏలో కేరళం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. సూపర్ లీగ్‌కు అర్హత సాధించలేకపోయింది.
వ్యక్తిగతంగా సంజూ మాత్రం మంచి ప్రదర్శన చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 137.86 స్ట్రైక్‌రేట్‌తో 233 పరుగులు సాధించాడు. జట్టులో రోహన్ కున్నుమ్మల్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒకవేళ ఈ సీజన్ లో సంజూ శాంసన్ ఆడకపోతే.. వినోద్ నాయకత్వ బాధ్యతలు చేపట్టవచ్చు. ఎస్ఎంఏటీ 2026-27 ఎడిషన్‌లో కేరళం జట్టుతో పాటు మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, పుదుచ్చేరి జట్లు గ్రూప్-సిలో ఉన్నాయి. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో కేరళం తమ తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.
కేరళం జట్టు:
సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ ఎస్. కున్నుమ్మల్, మహమ్మద్ అజరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, గోవింద్ దేవ్ డి. పై, కృష్ణ దేవన్ ఆర్.జె., విష్ణు వినోద్ (వికెట్ కీపర్), సల్మాన్ నిజార్, అఖిల్ స్కారియా, నిఖిల్, విఘ్నేశ్ పుత్తూర్, బిజు నారాయణన్ ఎన్., కార్తీక్ బి. నాయర్, వైశాఖ్ చంద్రన్, ఆసిఫ్ కేఎం, నిధీశ్ ఎం.డి., షరఫుద్దీన్ ఎన్.ఎం, జలజ్ సక్సేనా.
ఇవి కూడా చదవండి:
47 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. మరో లీగ్‌లోకి గేల్ రీఎంట్రీ!
శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్
మూడో వన్డే రద్దైనా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!