Share News

అర్ధ సెంచరీలతో రాణించిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. భారత్ స్కోర్ 191/8

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:36 PM

హామిల్టన్‌లో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 61, శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో రాణించారు.

అర్ధ సెంచరీలతో రాణించిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. భారత్ స్కోర్ 191/8
India vs New Zealand 5th T20

స్పోర్ట్స్ డెస్క్: హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20 జరుగుతోంది. టాస్ నెగ్గిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేంది. ఇషాన్ కిషన్(61), శ్రేయస్ అయ్యర్(50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు సంజూ శాంసన్(4), అభిషేక్ శర్మ(1) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్కోర్ బోర్డును కదిలించాడు. నమన్ ధిర్ 33, నితీశ్ కుమార్ రెడ్డి 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇక కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 4, నాథన్ స్మిత్ 2, టిక్నెర్ 2 వికెట్లు తీశారు.


ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. నాలుగో టీ20లో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. తిరిగి జట్టులో చేరాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కింది.


ఇవి కూడా చదవండి:

భువీని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు: మహ్మద్ కైఫ్

ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్

Updated Date - Nov 01 , 2026 | 02:52 PM