విరాట్‌ను ఇబ్బంది పెట్టిన యువ పేసర్.. ప్రాక్టీస్ సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:38 PM
నవంబర్ 4న ప్రారంభం కానున్న తొలి వన్డేకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన నెట్స్ ప్రాక్టీస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగింపు దశకు చేరుకోవడంతో టీమిండియా ఫోకస్ వన్డే సిరీస్‌పైకి మళ్లింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4న ప్రారంభం కానున్న తొలి వన్డేకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన నెట్స్ ప్రాక్టీస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా జట్టులోకి వచ్చిన యువ బౌలర్ ఆకిబ్ నబీ.. కోహ్లీకి చుక్కలు చూపించాడు.
భారత బ్యాటర్లను స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు చేసే ఉద్దేశంతో యువ ఫాస్ట్ బౌలర్లు ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్‌లతో ప్రత్యేకంగా బౌలింగ్ చేయించారు. ఈ ముగ్గురూ తమదైన శైలిలో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. గుర్నూర్ తన ఎత్తును ఉపయోగించుకుని బంతిని బాగా బౌన్స్ చేయగా.. కాంబోజ్ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. అయితే ఆకిబ్ నబీ రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. చురుకైన ఇన్ డిప్పర్స్‌తో కోహ్లీ ప్యాడ్లను లక్ష్యం చేసుకుని బంతులు విసిరాడు. కొన్ని అద్భుతమైన ఔట్ స్వింగర్లతో అతడిని బోల్తా కొట్టించాడు. దీంతో కాస్త అసహనానికి గురైన కోహ్లీ తిరిగి తనదైన శైలిలో కుదురుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మతో సరదాగా మాట్లాడి తిరిగి క్రీజులోకి వచ్చి నిలకడగా ఆడాడు. తొలి వన్డేకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ ప్రాక్టీస్ సెషన్ భారత బ్యాటర్లకు కీలకంగా మారింది. పిచ్ స్వభావం, బౌలర్ల నుంచి ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసుకునేందుకు ఈ సెషన్ ఉపయోగపడనుంది. మరోవైపు నెట్స్‌లోనే కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఆకిబ్ నబీ.. వన్డే సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్న ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
భువీని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు: మహ్మద్ కైఫ్
ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్