Share News

ఇదేం విచిత్రం.. మైదానంలోకి స్కూటీపై వచ్చేశాడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:50 PM

క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి అభిమానులు రావడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా స్కూటీపై గ్రౌండ్‌లోకి రావడం ఎప్పుడైనా చూశారా?

ఇదేం విచిత్రం.. మైదానంలోకి స్కూటీపై వచ్చేశాడు.. వీడియో వైరల్
Man rides scooter on cricket field

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి అభిమానులు రావడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా స్కూటీపై గ్రౌండ్‌లోకి రావడం ఎప్పుడైనా చూశారా? ఇండియా ఎ, న్యూజిలాండ్ ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు స్కూటీపై మైదానంలోకి రావడంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఈ ఘటనతో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా నవ్వుకున్నారు.


మ్యాచ్ తొలి రోజు ఆట చివరి దశలో న్యూజిలాండ్ ఎ బౌలర్ బ్రెట్ రాండెల్ 83వ ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్ రన్‌అప్ ప్రారంభించే సమయంలో భారత బ్యాటర్ ఆకాష్ దీప్ అతడిని ఆపమని సూచించాడు. ఎందుకంటే సైట్‌స్క్రీన్ ముందు నుంచి ఓ వ్యక్తి స్కూటీపై మైదానాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు. మొదట బౌలర్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూసేసరికి స్కూటీపై వెళ్తున్న వృద్ధుడు కనిపించాడు. దీంతో ఆట కొద్దిసేపు నిలిచిపోయింది. ఈ అనూహ్య ఘటనను చూసి భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు. కామెంటేటర్లు సైతం సరదాగా స్పందిస్తూ.. మ్యాచ్ చూసేందుకు అత్యుత్తమ ప్రదేశాన్ని ఎంచుకున్నాడంటూ ఆ వ్యక్తిపై చమత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

భువీని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు: మహ్మద్ కైఫ్

ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్

Updated Date - Nov 01 , 2026 | 12:51 PM