ఆఖరి టీ20: టాస్ నెగ్గిన న్యూజిలాండ్.. భారత్ బ్యాటింగ్
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:02 PM
హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. నాలుగో టీ20లో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. తిరిగి జట్టులో చేరాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కింది.
భారత తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
కివీస్ తుది జట్టు:
మిచెల్ శాంట్నర్(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వెల్, స్మిత్, మిల్నే, డఫీ, బ్లెయిర్
ఇవి కూడా చదవండి:
భువీని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు: మహ్మద్ కైఫ్
ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్