అదరగొట్టిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:46 PM
ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఏ బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించారు.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్ ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఏ జట్టు బ్యాటర్లు అదరగొట్టేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆటను 49 ఓవర్లకు కుదించడం జరిగింది. టీమిండియా బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66) హాఫ్ సెంచరీలు సాధించారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా 5 వికెట్లు తీసి.. భారత్ మరింత భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. అలానే సాఫి 3, ఇమ్రాన్ ఒక వికెట్ తీశారు.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో త్వరగానే పెవిలియన్‌కు చేరిన వైభవ్ సూర్యవంశీ ఈ సారి మాత్రం దుమ్ములేపాడు . ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం మొదలు పెట్టాడు. అయితే, సిక్స్‌లు లేకుండా కేవలం ఫోర్లతోనే ఇన్నింగ్స్‌ను ఆడటం విశేషం. 22 బంతుల్లోనే 44 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్దుల్లా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
మరోవైపు ప్రభ్ నిలకడగా ఆడుతూనే అప్పుడప్పుడు దూకుడు ప్రదర్శించాడు. ప్రియాంశ్ ఆర్య (8) త్వరగానే ఔటయ్యాడు. కానీ, రుతురాజ్, తిలక్ వర్మ జోడీ మాత్రం చెలరేగి ఆడింది. నిలకడగా ఆడుతూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో అర్ధ శతకాలు నమోదు చేశారు. ఆఖర్లో సూర్యాంశ్ షెడ్జే (40), అనుకుల్ రాయ్ (16*) వేగంగా ఆడారు. కానీ, స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో భారత్ 350 మార్క్‌ను అందుకోలేకపోయింది. మొత్తంగా అఫ్గాన్ జట్టు ముందు 350 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నిర్దేశించింది.
ఇవి కూడా చదవండి:
వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1గా టీమిండియా..
విదేశీ గడ్డపై వైభవ్ మెరుపు ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ మిస్