Share News

టీమిండియా అరుదైన రికార్డు.. వన్డేల్లో 350+ స్కోరు 45వ సారి

ABN , Publish Date - Oct 03 , 2026 | 08:54 PM

న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(129*)మెరుపు సెంచరీతో పాటు రోహిత్ శర్మ(92) రాణించడంతో టీమిండియా 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో..

టీమిండియా అరుదైన రికార్డు.. వన్డేల్లో 350+ స్కోరు 45వ సారి
India ODI Record

న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(129*)మెరుపు సెంచరీతో పాటు రోహిత్ శర్మ(92) రాణించడంతో టీమిండియా 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కూడా(57)అర్ధ శతకంతో భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్‌లో టీమిండియా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే చ‌రిత్ర‌లో భారత్ 350కి(India 350 ODI Score Record) పైగా పరుగులు చేయడం ఇది 45వ సారి.


వన్డేల్లో 350కి పైగా పరుగులు ఎక్కువ సార్లు సాధించిన జట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సౌతాఫ్రికా(36 సార్లు) రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా మధ్య 11 వ్యత్యాసం ఉంది. దీంతో టీమిండియా ఎవరికీ అందనంత టాప్‌లో కొనసాగుతోంది. ఇక భార‌త్‌, సౌతాఫ్రికా త‌ర్వాత ఆస్ట్రేలియా 31సార్లు 350 ప్ల‌స్ స్కోర్లు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 29 సార్లు, న్యూజిలాండ్ 18 సార్లు చొప్పున వ‌న్డేల్లో 350 ఫ్లస్ స్కోరు చేశాయి.


ఈ రికార్డుతో పాటు భారత్ మరో రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వ‌న్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు క‌లిపి 45 సిక్స‌ర్లు కొట్టారు. త‌ద్వారా ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జ‌ట్ల జాబితాలో ఇంగ్లండ్‌తో క‌లిపి భారత్ మూడో స్థానంలో కొన‌సాగుతుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 2013లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 66 సిక్సర్లు బాదింది. అలానే వెస్టిండీస్ కూడా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో 66 సిక్స‌ర్లు బాదింది. ఇక సౌతాఫ్రికా (55 సిక్స‌ర్లు వ‌ర్సెస్ ఆస్ట్రేలియా, 2023లో) రెండో స్థానంలో కొన‌సాగుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.... 22 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్

Updated Date - Oct 03 , 2026 | 09:12 PM