చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!
ABN , Publish Date - May 09 , 2026 | 10:51 AM
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో చెలరేగాడు. 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో చెలరేగాడు. 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిన్ సుడిగాలి ఇన్నింగ్స్ ధాటికి కేకేఆర్ 143 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ నేపథ్యంలోనే ఫిన్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
2026 క్యాలెండర్‌లో వేరువేరు టోర్నీలో సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఈ ఏడాదిలో బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున 53 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ తరఫున 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో శతకం సాధించాడం విశేషం.
ఐపీఎల్‌లో న్యూజిలాండ్ తరఫున సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. అతడి కంటే ముందు బ్రెండన్ మెక్‌కల్లమ్ ఈ ఫీట్ సాధించాడు. మెక్‌కల్లమ్ ఐపీఎల్‌లో రెండుసార్లు సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఫిన్ అలెన్‌ది నాలుగో సెంచరీ. గతంలో మెక్‌కల్లమ్ (158 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (104), సునీల్ నరైన్ (109) సెంచరీలు సాధించారు. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ఫిన్ అలెన్ (10 ) మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ (13), ఆండ్రీ రసెల్ (11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి: