పతక రేసులో సాహిల్,సిమ్రన్
ABN , Publish Date - May 09 , 2026 | 02:36 AM
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో భారత ఆర్చర్లు సిమ్రన్‌జీత్ కౌర్, సాహిల్ జాధవ్ వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతక రేసులో నిలిచారు. మహిళల వ్యక్తిగత..
సెమీస్‌కు భారత ఆర్చర్లు
సురేఖ, ధీరజ్ విఫలం
ప్రపంచకప్ స్టేజ్-2
షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో భారత ఆర్చర్లు సిమ్రన్‌జీత్ కౌర్, సాహిల్ జాధవ్ వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతక రేసులో నిలిచారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్లో సిమ్రన్ 6-0తో ఫాంగ్ యూ జూ (తైవాన్)పై గెలిచింది. సెమీ్‌సలో ప్రపంచ నెంబర్‌వన్ కాంగ్ చాయెంగ్ (దక్షిణ కొరియా)తో సిమ్రన్ తలపడనుంది. మిగతా భారత ఆర్చర్లలో దీపికా కుమారి, కుమ్‌కుమ్ నాలుగోరౌండ్లోనే ఓటమిపాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్స్‌లో సాహిల్, అతని ప్రత్యర్థి నికో వీనర్ (ఆస్ట్రియా) ఇద్దరు చెరో 147 పాయింట్లు స్కోరు చేసి సమంగా నిలిచారు. దీంతో ఫలితం కోసం అనివార్యమైన షూటా్‌ఫలో సాహిల్ 10-9తో నికోను ఓడించి నికోలస్ గిరార్డ్ (ఫ్రాన్స్)తో సెమీ్‌సపోరుకు సిద్ధమయ్యాడు. తెలుగు ఆర్చర్లు జ్యోతి సురేఖ (కాంపౌండ్), ధీరజ్ (రికర్వ్) వ్యక్తిగత విభాగాల్లో నాలుగోరౌండ్లోనే ప్రత్యర్థుల చేతిలో ఓడి నిరాశపరిచారు. సిమ్రన్, సాహిల్ సెమీస్‌లో ఓడితే, కాంస్యం కోసం ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్