సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ABN , Publish Date - May 08 , 2026 | 05:18 PM
పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియా వ్లాగింగ్‌పై బీసీసీఐ రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్‌దీప్‌ను కోరినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రతి మ్యాచ్ అనంతరం సరదాగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అతడు చేసిన వ్లాగ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియా వ్లాగింగ్‌పై బీసీసీఐ రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్‌దీప్‌ను కోరినట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ‘వేపింగ్’ చేశాడన్న వివాదం చెలరేగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పంజాబ్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో అర్ష్‌దీప్ సింగ్ వ్లాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చాహల్ చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు చాహల్ గానీ, ఫ్రాంచైజీ గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే చాహల్ వేపింగ్ చేస్తున్నట్లు ప్రాంక్ చేశాడన్న వార్తలూ వచ్చాయి. అయితే ఇదే తరహా ఘటన ఈ సీజన్‌లో తొలిసారి కాదు. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఈ సిగరేట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. దీంతో అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. దీంతో ఈ టోర్నీ ముగిసే వరకు వ్లాగ్‌లు ఏమీ పోస్ట్ చేయొద్దని బీసీసీఐ.. అర్ష్‌దీప్ సింగ్‌కు సూచించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్