అమ్మాయిలు అదరగొట్టారు
ABN , Publish Date - May 09 , 2026 | 02:32 AM
భారత ఫుట్‌బాల్ అమ్మాయిలు సంచలన ప్రదర్శన నమోదు చేశారు. ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు...
క్వార్టర్స్‌కు భారత్
ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్
సుఝౌ (చైనా): భారత ఫుట్‌బాల్ అమ్మాయిలు సంచలన ప్రదర్శన నమోదు చేశారు. ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లి అదరగొట్టారు. గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో భారత్ 4-0తో లెబనాన్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు అర్హత సాధించింది. ప్రీతికా బర్మన్ (7వ నిమిషం, 85వ) రెండు గోల్స్ చేయగా.. అల్వా దేవి (36వ), జోయా (72వ) చెరో గోల్ కొట్టారు. ఈ టోర్నీలో నాకౌట్ చేరడం భారత్‌కిదే మొదటిసారి. గతంలో 2004లో ఏఎఫ్‌సీ అండర్-19 చాంపియన్‌షి్‌పలో భారత మహిళలు క్వార్టర్స్ చేరారు. ఇక, సోమవారం జరిగే క్వార్టర్స్‌లో ఆతిథ్య చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్‌లో గెలిస్తే భారత్‌కు ఈ ఏడాది మొరాకోలో జరిగే ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచక్‌పనకు బెర్త్ దక్కుతుంది.
ఇవి కూడా చదవండి:
సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!
ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్