Share News

భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌

ABN , Publish Date - May 09 , 2026 | 10:22 AM

భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌
Krishna Swaminathan

ఢిల్లీ: భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 31 మే 2026న దినేశ్ కుమార్ త్రిపాఠి పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం అదే రోజున కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 31 డిసెంబర్ 2028 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ముంబైలోని పశ్చిమ నావికాదళ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేస్తున్నారు.


భారత నావికాదళంలో స్వామినాథన్ 1987 జులై 1న చేరారు. తన సేవా కాలంలో కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో నైపుణ్యం సాధించి అనేక కీలక పదవులను నిర్వర్తించారు. ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ష్రివెన్‌హామ్‌లో ఉన్న జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, కరంజాలోని కాలేజ్ ఆఫ్ నావల్ వార్‌ఫేర్, రోడ్ ఐలాండ్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ నావల్ వార్ కాలేజీలో స్వామినాథన్ విద్యను అభ్యసించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ భారత రక్షణ శాఖ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

విజయ్‌కు మద్దతుగా సంతకం పెట్టిన ఎమ్మెల్యే కామరాజ్.. వీడియో విడుదల చేసిన టీవీకే..

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియామకం

Updated Date - May 09 , 2026 | 11:26 AM