రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ABN , Publish Date - Sep 03 , 2026 | 08:20 PM
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ చెక్ పెట్టింది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: బీసీసీఐ ఉన్నత స్థాయి సమావేశం ఇవాళ(గురువారం) ముంబైలో జరిగింది. ఈ చర్చలో రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై గురించి ప్రస్తావనకు వస్తుందని అంతా భావించారు. అయితే హిట్ మ్యాన్ అంశంమే ప్రస్తావనకు రాలేదు. కేవలం టీమిండియా భవిష్యత్ ప్రణాళికపై, ఆటగాళ్ల గాయాల గురించే ప్రస్తావనకు వచ్చింది. ఇక సమావేశం అనంతరం రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ గురించి మీడియా ప్రస్తావించగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. ఊహాగానాలకు నేను ఆజ్యం పోయాలనుకోవడం లేదు. అతడు అన్ని మ్యాచ్‌లలోనూ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి?. ఇటీవలే లార్డ్స్‌లో జరిగిన వన్డేలో అతడు 130-140 పరుగులు సాధించాడు. అయినా ఇంకా వదంతూలు ఎందుకు ప్రచారం?. అలాంటి వార్తలను వ్యాప్తి చేసే వారికి నేను ఊతం ఇవ్వాలని అనుకోవడం లేదు’ అని సైకియా పేర్కొన్నారు.
మొత్తంగా ప్రస్తుతం రోహిత్ ఫామ్, అందుబాటుపై బీసీసీఐ సానుకూలంగానే ఉన్నట్లు సైకియా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కూడా సైకియా స్పందించారు. మీటింగ్ గురించి ముందుగా సమాచారం ఇవ్వలేకపోయామని, అందుకే అగార్కర్ రాలేదని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి
వృద్ధురాలిని ఎత్తుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి