Share News

చరిత్ర సృష్టించిన టామ్ కర్రన్.. టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:20 PM

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదైంది. వూర్‌బ‌ర్గ్ వేదిక‌గా బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్ పేస‌ర్‌ టామ్ క‌ర్రాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు.

చరిత్ర సృష్టించిన టామ్ కర్రన్.. టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు
Tom Curran

స్పోర్ట్స్ డెస్క్: యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్(ఈటీపీఎల్)లో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదైంది. ఎడిన్‌బర్గ్ క్యాజికల్ రాకర్స్ పేసర్, ఇంగ్లండ్ స్టార్ టామ్ కర్రాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. వూర్‌బర్గ్ వేదికగా బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 59 పరుగులతేడాతో ఎడిన్‌బర్గ్ విజయం సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే...


తొలుత బ్యాటింగ్ చేసిన ఎడిన్‌బ‌ర్గ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 189 ప‌రుగులు సాధించింది. ఓపెన‌ర్ జేజే స్మట్స్ 98 పరుగులతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అత‌డితో పాటు బ్రెండ‌న్ మెక్‌ముల్ల‌న్‌ 30 పరుగులతో రాణించాడు. అనంత‌రం 190 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బెల్‌ఫాస్ట్‌ జట్టు 130 పరుగులకే ఆలౌటైంది. బెల్ ఫాస్ట్ జట్టుకు ఆరంభంలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.


ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ వ‌రుసగా రెండు వికెట్లు ప‌డ‌గొట్టి ఆ జట్టుకు బిగ్ షాకిచ్చాడు. తర్వాత ఐదో ఓవ‌ర్లో పాల్ స్టిర్లింగ్‌(25)ను కూడా బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక మ్యాచ్ చివర్లో కర్రాన్ మ్యాజిక్ చేశాడు. 16వ ఓవర్‌ వేసిన కర్రాన్‌.. ఐదో బంతికి ఫ్రెడ్‌ క్లాసెన్‌, చివరి బంతికి మాథ్యూ హంఫ్రీస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 18వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన టామ్‌ కర్రాన్‌ తొలి బంతికి అదైర్‌ను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు.


కర్రాన్ బౌలింగ్‌ ధాటికి బెల్‌ఫాస్ట్‌ 130 పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు కర్రన్ ఐదు వికెట్లు మాత్రమే తీసినప్పటికీ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. 2019లో జరిగిన టీ20 బ్లాస్ట్‌లో కర్రాన్ గ్లామోర్గాన్‌పై తన తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెటర్లలో టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రవి బోపారాతో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని ఆడడు: సీఎస్కే మాజీ ప్లేయర్

వాళ్లు ఓడలేదా?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు

Updated Date - Sep 03 , 2026 | 06:45 PM