వాళ్లు ఓడలేదా?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:36 PM
పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టు తప్పులను కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ.. భారత్ జట్టు ప్రస్తావన తీసుకొచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ చేతిలో వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్‌తో జరగాల్సిన మూడో టెస్టుకు ముందే జట్టులోని మొత్తం ఏడు మంది ఆటగాళ్లపై వేటుపడింది. అంతేకాక కోచ్‌లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్‌ను వెనక్కి పిలిపించింది. దీంతో పాకిస్థాన్.. క్రీడా ప్రపంచం ముందు నవ్వుల పాలైంది.
తమ జట్టులోని లోపాలను సరిదిద్దుకోలేని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ ఇతర జట్లపై తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి బలమైన జట్లైనా అప్పుడప్పుడు ఊహించని ఓటములను చవిచూడటం సాధారణమని, తమ లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు నఖ్వీ.
'మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. నమీబియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడలేదా?. అలానే ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోలేదా?. అంతమాత్రాన అక్కడితో క్రికెట్ ముగిసిపోయిందా?. ఆటల్లో జయాపజయాలు సహజం. మాకు ఎవరైతే అవసరమో వారిని కచ్చితంగా జట్టులోకి తీసుకుంటాం. అంతే తప్ప వరుసగా విఫలమమ్యే వారిని ఇకపై జట్టులో కొనసాగించం. మాకు ప్రతీ మ్యాచ్, ప్రతీ సిరీస్ కూడా చాలా ముఖ్యమని' అని నఖ్వీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి: