Share News

తిలక్‌ అదిరెన్‌!

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:10 AM

తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో అదరగొట్టిన సౌత్‌జోన్‌ సారథి తిలక్‌ వర్మ..రెండో ఇన్నింగ్స్‌లో నూ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో...

తిలక్‌ అదిరెన్‌!

ఫైనల్‌కు సౌత్‌

సెమీస్‌లో నార్త్‌ జోన్‌ ఓటమి జూదులీప్‌ ట్రోఫీ

బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో అదరగొట్టిన సౌత్‌జోన్‌ సారథి తిలక్‌ వర్మ..రెండో ఇన్నింగ్స్‌లో నూ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో నార్త్‌జోన్‌తో జరిగిన దులీప్‌ ట్రోఫ్‌ సెమీఫైనల్లో సౌత్‌జోన్‌ ఏడు వికెట్లతో గెలుపొందింది. ఈనెల ఆరు నుంచి చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్లో సౌత్‌ జట్టు ఈస్ట్‌జోన్‌తో తలపడనుంది. ఆఖరి రోజైన బుధవారం 181 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో..రికీ భుయ్‌ (42), నారాయన్‌ జగదీశన్‌ (43) మొదటి వికెట్‌కు 64 పరుగులతో శుభారంభం ఇచ్చారు. రికీ, రషీద్‌ (1) వెంటవెంటనే నిష్క్రమించగా..జగదీశన్‌తో కలిసి తిలక్‌ రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. జగదీశన్‌ను ముస్తాక్‌ అవుట్‌ చేయగా, రవిచంద్రన్‌ స్మరణ్‌ (32 నాటౌట్‌) జతగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‘ తిలక్‌ (51 నాటౌట్‌) మూడో వికెట్‌కు అభేద్యంగా 80 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ 256/7 స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన నార్త్‌జోన్‌ జట్టు 297 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్‌ 195, సౌత్‌జోన్‌ 312 రన్స్‌ చేశాయి.

ఇవి కూడా చదవండి:

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Updated Date - Sep 03 , 2026 | 05:10 AM