మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:01 AM
మొట్ట మొదటి మహిళల చాంపియన్స్ ట్రోఫీని భారత్ నిర్వహించనుంది. ఈమేరకు ఐసీసీ బుధవారం ప్రకటించింది....
శ్రీలంక స్థానంలో ఎంపిక చేసిన ఐసీసీ
దుబాయ్: మొట్ట మొదటి మహిళల చాంపియన్స్ ట్రోఫీని భారత్ నిర్వహించనుంది. ఈమేరకు ఐసీసీ బుధవారం ప్రకటించింది. ఆరు జట్ల ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా జరగనుంది. వాస్తవంగా ఈ టోర్నీ హక్కులను తొలుత శ్రీలంక దక్కించుకుంది. కానీ శ్రీలంక క్రికెట్‌లో ఆ దేశ ప్రభుత్వ జోక్యం దరిమిలా..ఆతిథ్యం నుంచి శ్రీలంకను ఐసీసీ తప్పించిన సంగతి తెలిసిందే. తర్వాత బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా బోర్డులను పరిశీలించిన ఐసీసీ..చివరకు భారత్‌కు ఆతిథ్యాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఐసీసీ బోర్డు ఆమోదించింది జూలై ఆరు నాటికి ఐసీసీ టీ20 ర్యాంకుల్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే టోర్నీలో తొలి రెండు స్థానాలలో నిలిచే జట్లు ఫైనల్‌కు చేరతాయి.
ఇవి కూడా చదవండి:
కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్