Share News

లక్ష్య మరో‘సారీ’..

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:57 AM

స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ అతడు తొలి రౌండ్‌లోనే...

లక్ష్య మరో‘సారీ’..

చైనా మాస్టర్స్‌

  • తొలి రౌండ్‌లోనే పరాజయం

  • శ్రీకాంత్‌, తన్వి, సాత్విక్‌ జోడీ బోణీ

షెన్‌జెన్‌: స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ అతడు తొలి రౌండ్‌లోనే తిరుగుముఖం పట్టారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్‌లో లక్ష్యసేన్‌ 14-21, 7-21తో వరల్డ్‌ నెం.9 విక్టర్‌ లాయ్‌ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-16, 21-15తో చి యు జెన్‌ (తైపీ)పై గెలుపుతో రెండో రౌండ్‌ చేరాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తన్వీశర్మ 21-16, 21-17తో అమాలీ షుల్జ్‌ (డెన్మార్క్‌)ను చిత్తు చేసింది. కానీ దేవికా సిహాగ్‌ 18-21, 15-21తో నల్బంటోవా (బల్గేరియా) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 21-11, 21-16తో జునైదీ/కాంగ్‌ ఖాయ్‌ (మలేసియా)ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా ద్వయం 21-8, 21-9తో సెహెంగ్‌/టొనిచా (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది. మరో మిక్స్‌డ్‌ జోడీ రోహన్‌/రుత్విక శివాని జంట 16-21, 18-21తో ఉ గువాన్‌/లీ చియా (తైపీ) చేతిలో ఓటమి పాలైంది.

ఇవి కూడా చదవండి:

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Updated Date - Sep 03 , 2026 | 04:57 AM