బ్యాటర్లు బాదేయాలి!
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:06 AM
బ్యాటింగ్ లోపాలకు చెక్ పెట్టాలి.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. టీ20 ఆసియా కప్‌లో గురువారం గ్రూప్-ఎలో పసికూన హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు...
హాంకాంగ్‌తో భారత్ పోరు నేడు
మహిళల టీ20 ఆసియా కప్
రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
దుబాయ్: బ్యాటింగ్ లోపాలకు చెక్ పెట్టాలి.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. టీ20 ఆసియా కప్‌లో గురువారం గ్రూప్-ఎలో పసికూన హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఇదే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిడిలార్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. తొలి 10 ఓవర్లలో 101/2తో పటిష్టంగా కనిపించిన భారత్.. 29 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపాటుకు గురి చేసింది. అయితే, 94 పరుగుల తేడాతో భారత్ గెలిచినా.. టాప్ జట్లతో మ్యాచ్‌లో ఇలా జరిగే పరిస్థితేంటనే ప్రశ్న ఎదురవుతోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. దీప్తి శర్మ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టడం చెప్పుకోదగ్గ విషయం. కానీ, స్మృతి మంధాన, ప్రతికా రావల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బ్యాట్లను ఝుళిపించాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఆసియా క్రీడలు ఉండడంతో.. జట్టులోని లోపాలను వీలైనంత త్వరగా భారత్ సరిదిద్దుకోవాలి. మరోవైపు థాయ్‌లాండ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిన హాంకాంగ్ ఈ మ్యాచ్‌లో సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో పేసర్ మరీనా లంప్లో (4/11) రాణిస్తోంది. థాయ్‌ను 121 పరుగులకే కట్టడి చేయడంలో లంప్లో కీలకపాత్ర పోషించింది. బ్యాటర్లు పోరాడి ఓ మోస్తరు స్కోరు చేస్తే.. మరీనా నుంచి భారత్‌కు గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్