టీమిండియా కోచ్‌గా లక్ష్మణ్.. ఆమోదం తెలిపిన కేంద్రం
ABN , Publish Date - Sep 03 , 2026 | 07:31 PM
ఆసియా క్రీడలు 2026లో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు-2026 టోర్నీలో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో లక్ష్మణ్ (VVS Lakshman) ఈ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. దాదాపు అదే సమయంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ తలపడనుంది. అందుకే, గంభీర్ స్వదేశంలోనే ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. ఆసియా క్రీడల్లో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లో తలపడనుంది. కాగా జపాన్‌లోని ఐచి- నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడలు జరగనున్నాయి.
ఆసియా క్రీడలకు లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లడం ఇది రెండోసారి. గతంలో 2023లో చైనా వేదికగా జరిగిన పోటీలకూ అతడే కోచ్‌గా వ్యవహరించాడు. అప్పుడు భారత్ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత పలు సిరీస్‌లకూ గంభీర్ స్థానంలో లక్ష్మణ్ మార్గదర్శకుడి వెళ్లాడు. 2026 ఆసియా క్రీడలకు లక్ష్మణ్ బృందంలో మాజీ క్రికెటర్లు సునీల్ జోషి, హృషికేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్‌కు అవకాశం దక్కింది. మరూఫ్ ఫజందార్‌ను టీమ్ లీడర్‌గా కేంద్రం నియమించింది.
ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్ గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma)కు ఎంపికయ్యాడు. ఇందులో వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నారు. ఆసియా క్రీడల్లో అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన టామ్ కర్రన్.. టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని ఆడడు: సీఎస్కే మాజీ ప్లేయర్