ఆఫ్గన్ ప్లేయర్‌కు బిగ్ షాక్.. చర్యలకు దిగిన ఐసీసీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:02 PM
ఆఫ్గనిస్థాన్ వికెట్ కీపర్, బ్యాటర్ అఫ్సర్ జజాయ్‌కి బిగ్ షాక్ తగిలింది. అతడిపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడికి హెచ్చరికలు జారీ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆఫ్గనిస్థాన్ వికెట్ కీపర్, బ్యాటర్ అఫ్సర్ జజాయ్‌కి బిగ్ షాక్ తగిలింది. అతడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడికి హెచ్చరికలు జారీ చేసింది. అఫ్సర్ క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా ఐసీసీ చేర్చింది.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అఫ్సర్.. ఆఫ్గన్ జట్టుకు అదనపు ఆటగాడిగా వ్యవహరించాడు. ఈ సమయంలో పలుమార్లు మైదానంలోకి వచ్చాడు. అలా గ్రౌండ్లోకి రావద్దని, ఆట ఆలస్యమయ్యేలా చేయవద్దని అంపైర్లు పలుమార్లు అతడికి సూచించారు. అయిన అతడు అంఫైర్ల ఆదేశాలను ధిక్కరిస్తూ మైదానంలోకి ప్రవేశించాడు. దీంతో అంపైర్ అఫ్సర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. అంపైర్ ఫిర్యాదులపై స్పందిచిన ఐసీసీ అఫ్సర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ ఆదేశాలను పాటించకపోవడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4 ఉల్లంఘన కిందికి వస్తుంది. గత రెండేళ్ల కాలంలో అతడు చేసిన మొదటి తప్పిదం ఇది. దీంతో మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది.
అఫ్సర్ జజాయ్ విషయానికి వస్తే.. అతడు కుడిచేతి వాటం వికెట్ కీపర్, బ్యాటర్. ఆఫ్గనిస్థాన్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 10 టెస్టులు ఆడిన జజాయ్ 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. 17 వన్డేల్లో 264 పరుగులు, ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 141 పరుగులు సాధించాడు. అలానే అఫ్సర్ 2010, 2012 అండర్-19 ప్రపంచ కప్‌లోనూ ఆఫ్గనిస్థాన్ తరఫున ఆడాడు.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ